Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

అక్టోబర్ 10 CJP నిరసన దృశ్యాలంటూ అస్సాం వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు

Дата публикации: 13-10-2026 09:30:12

10 అక్టోబర్ 2026న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో జరిగిన అవకతవకల కారణంగా, ఇష్టానుసారంగా ఓటర్లను తొలగించారని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనను నిర్వహించింది. ఈ ప్రదర్శనలకు ప్రతిస్పందనగా, అధికారులు రాజధాని అంతటా భద్రతా చర్యలు చేపట్టారు. డజన్ల కొద్దీ మెట్రో స్టేషన్లను మూసివేశారు, రైళ్లను రద్దు చేసి నిషేధాజ్ఞలను అమలు చేశారు. పోలీసులు అరవింద్ [...]
The post అక్టోబర్ 10 CJP నిరసన దృశ్యాలంటూ అస్సాం వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.


Основное содержимое страницы с новостью.

10 అక్టోబర్ 2026న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో జరిగిన అవకతవకల కారణంగా, ఇష్టానుసారంగా ఓటర్లను తొలగించారని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనను నిర్వహించింది. ఈ ప్రదర్శనలకు ప్రతిస్పందనగా, అధికారులు రాజధాని అంతటా భద్రతా చర్యలు చేపట్టారు. డజన్ల కొద్దీ మెట్రో స్టేషన్లను మూసివేశారు, రైళ్లను రద్దు చేసి నిషేధాజ్ఞలను అమలు చేశారు. పోలీసులు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, మమతా బెనర్జీ వంటి రాజకీయ ప్రముఖులతో పాటు, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో సహా వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు, అయితే వారిని తరువాత విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో, పోలీసు నిర్బంధాల మధ్య ఢిల్లీకి పెద్ద ఎత్తున నిరసనకారులు చేరుకున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 10 అక్టోబర్ 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనను చూపుతున్న దృశ్యాలు.

ఫాక్ట్: వైరల్ వీడియో  అస్సాంలోని తిన్సుకియా నగరంలో జరిగిన మహాలయ సంబరాలకు సంబంధించినది. దీనితో 10 అక్టోబర్ 2026న ఢిల్లీలో జరిగిన CJP నిరసనలకు ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలతో ఉన్న మరిన్ని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వాటి ప్రకారం, ఈ వీడియో అస్సాంలోని టిన్సుకియా నగరంలో 10 అక్టోబర్ 2026న జరిగిన మహాలయ ఉత్సవాలకు సంబంధించినదని తెలిసింది. వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలను, ఈ ఉత్సవానికి సంబంధించిన వీడియోలతో పోల్చి చూడగా, ఇది టిన్సుకియాలో జరిగిన మహాలయ ఉత్సవానిదేనని స్పష్టమవుతుంది.

అలాగే, గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా పరిశీలించగా, ఈ వీడియోను అస్సాంలోని టిన్సుకియా నగరంలో ఉన్న ఠాణా చరియాలి ప్రాంతంలో చిత్రీకరించినట్లు నిర్ధారించవచ్చు. దీన్ని బట్టి, ఈ వైరల్ వీడియోకు ఢిల్లీలో జరిగిన CJP నిరసనలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పవచ్చు.

చివరిగా, అక్టోబర్ 10న జరిగిన CJP నిరసన దృశ్యాలంటూ అస్సాంకి చెందిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక సంబంధం లేని వీడియోను, ఢిల్లీలో జరిగిన CJP నిరసనల వీడియోగా తప్పుగా షేర్ చేస్తున్నారు08.4714-10-2026
2కోల్‌కతాలో ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపిన వీడియోను ఢిల్లీకి సంబంధించిందిగా తప్పుగా షేర్ చేస్తున్నారు08.8513-10-2026
3These videos are AI-generated and do not show a protest against CEC Gyanesh Kumar in Delhi08.5115-10-2026
4An unrelated courtroom exchange video is shared as showing a lawyer confronting the CJI over the CJP protest against Gyanesh Kumar06.515-10-2026
5A July 2026 video of a farmers’ protest in Bhopal is shared as showing the protests in Delhi on 11 October 202608.5813-10-2026
6The viral video shows Tejashwi Yadav’s August 2026 protest march in Patna, not CJP’s Tiranga March in Delhi07.4817-10-2026
7This viral video of a young woman criticising the CJP protests demanding Gyanesh Kumar’s resignation is AI-generated04.0314-10-2026
8Old, unrelated video of an altercation involving AISA members is shared as police identifying and arresting students involved in the CJP protest07.3829-07-2026
9This video of DCP Sumit Jha purportedly resigning over alleged government pressure to lie about CJP student protesters is AI-manipulated08.828-07-2026
10An unrelated video is shared as showing a young woman being beaten by her family members for abusing PM Modi during the Delhi CJP protest0705-08-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 10.66. Источник: factly.in.