Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

కోల్‌కతాలో ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపిన వీడియోను ఢిల్లీకి సంబంధించిందిగా తప్పుగా షేర్ చేస్తున్నారు

Дата публикации: 13-10-2026 07:17:16

అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, 2025 జూన్ 25 నుంచి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లన్నింటినీ తిరిగి చేర్చాలని కూడా CJP డిమాండ్ చేస్తోంది. లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘాలు కూడా ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొంటామని ప్రకటన విడుదల చేశాయి. జంతర్ మంతర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన [...]
The post కోల్‌కతాలో ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపిన వీడియోను ఢిల్లీకి సంబంధించిందిగా తప్పుగా షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.


Основное содержимое страницы с новостью.

అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, 2025 జూన్ 25 నుంచి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లన్నింటినీ తిరిగి చేర్చాలని కూడా CJP డిమాండ్ చేస్తోంది. లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘాలు కూడా ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొంటామని ప్రకటన విడుదల చేశాయి. జంతర్ మంతర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సీజేపీ (CJP) నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో “జ్ఞానేశ్ కుమార్ రాజీనామ కోరుతూ.. ఢిల్లీలో మిన్నంటిన విద్యార్థుల ఆందోళనలు”  అంటూ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సిఈసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామ కోరుతూ ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో జూలై 2026లో కోల్‌కతాలోని సీల్దా రైల్వే స్టేషన్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంబంధించింది. ఢిల్లీకి సంబంధించిన వీడియో కాదు. కాబట్టి, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది. 

వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, 25 జూలై 2026న ఇదే విజువల్స్ తో ఉన్న వీడియోను @Manchh_Official అనే పేజీలో షేర్ చేసిన ఒక X పోస్టును గుర్తించాము. ఈ వీడియో కోల్‌కతాలో ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంబంధించింది అని ఈ పోస్టు పేర్కొంది.

2026 జూలైలో ఈ వీడియోను షేర్ చేసిన పలు పోస్టులను గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ). ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కోల్‌కతాలోని సీల్దా రైల్వే స్టేషన్‌లో నిరసన తెలిపారని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు. ఈ నిరసనకు SFIతో పాటు మరికొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. వీటి ఆధారంగా ఈ వీడియో ఢిల్లీలో CJP నిరసన గురించి ప్రకటించడానికి ముందే ఈ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు అని, CJP నిరసనకు ఈ వైరల్ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది.

తదుపరి, గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయగా సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, సీల్దా రైల్వే స్టేషన్ బయట ప్రాంతంతో సరిపోలినట్లు గుర్తించాము.

చివరిగా, కోల్‌కతాలో ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపిన వీడియోను ఢిల్లీకి సంబంధించిందిగా తప్పుగా షేర్ చేస్తున్నారు.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక సంబంధం లేని వీడియోను, ఢిల్లీలో జరిగిన CJP నిరసనల వీడియోగా తప్పుగా షేర్ చేస్తున్నారు08.4714-10-2026
2అక్టోబర్ 10 CJP నిరసన దృశ్యాలంటూ అస్సాం వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు010.6613-10-2026
3These videos are AI-generated and do not show a protest against CEC Gyanesh Kumar in Delhi08.5115-10-2026
4An unrelated courtroom exchange video is shared as showing a lawyer confronting the CJI over the CJP protest against Gyanesh Kumar06.515-10-2026
5Old, unrelated video of an altercation involving AISA members is shared as police identifying and arresting students involved in the CJP protest07.3829-07-2026
6A July 2026 video of a farmers’ protest in Bhopal is shared as showing the protests in Delhi on 11 October 202608.5813-10-2026
7This video of DCP Sumit Jha purportedly resigning over alleged government pressure to lie about CJP student protesters is AI-manipulated08.828-07-2026
8Heavy security in Delhi ahead of CJP's 'Lehra do Tiranga' protest on October 16 06.6915-10-2026
9Opposition leader Gandhi demands India PM's resignation over protest crackdown-2721-07-2026

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 9. Тональность: 0. Информативность: 8.85. Источник: factly.in.